Yamini Social Media Star _ సోషల్ మీడియా స్టార్ నుంచి 'క్వీన్' హీరోయిన్‌గా యామినీ ఎంట్రీ!

సోషల్ మీడియా స్టార్ నుంచి 'క్వీన్' హీరోయిన్‌గా యామినీ ఎంట్రీ!

​సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు వెండితెరపై మెరవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తాజాగా మరో ఫేమస్ సోషల్ మీడియా స్టార్ యామినీ ఈఆర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఒక పవర్‌ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్ కథతో ఆమె వెండితెరకు పరిచయం కాబోతున్నారు.

దర్శకుడు రతన్ రిషి 'క్వీన్'

​గతంలో 'ఉత్తర', 'ఆర్టిస్ట్' వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రతన్ రిషి, ఇప్పుడు తన మూడో చిత్రంగా 'క్వీన్' సినిమాను రూపొందిస్తున్నారు. వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ కంప్లీట్ హీరోయిన్ సెంట్రిక్ కథతో రాబోతోంది.

విలన్లుగా అజయ్ ఘోష్, ప్రభాకర్

​ఈ సినిమాలో ప్రతి నాయకులుగా (విలన్స్) కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు నటిస్తుండటం విశేషం. ఇక హీరోయిన్ తండ్రి పాత్ర చాలా స్పెషల్‌గా ఉండబోతోందట. ఈ పాత్ర కోసం 90వ దశకానికి చెందిన ఒకప్పటి స్టార్ హీరోను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్

​తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది.

​"రాళ్ల మీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి.. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని మిగిలిపోతాయి.. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ నిలుస్తుంది

​అంటూ గ్లింప్స్‌లో వినిపించిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. భారత రాజ్యాంగం, RTI యాక్ట్, గవర్నమెంట్ సిస్టమ్ వంటి అంశాలను కథలో జోడించడం మూవీపై క్యూరియాసిటీని పెంచుతోంది.

కథా నేపథ్యం

​తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేసే క్రమంలో, ఆ ఆశయానికి చట్టబద్ధమైన గుర్తింపు తీసుకురావడానికి ఒక సామాన్య యువతి ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ సినిమా కథ. ఒక స్ఫూర్తిదాయకమైన జర్నీని దర్శకుడు రతన్ రిషి ఇందులో చూపించబోతున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.